16

వేంగామంబ గారి మంగళ హారతి - దుర్గా స్తోత్రాలు

శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1)

జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం

శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)

జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం

ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3)

జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం

పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)

జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)

జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం

More: శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం

శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం